HomeTelugu Trendingఐ లవ్ 'రామ్ గోపాల్ వర్మ' అంటున్న శ్రీరెడ్డి

ఐ లవ్ ‘రామ్ గోపాల్ వర్మ’ అంటున్న శ్రీరెడ్డి

Sri reddy reacts on parannవివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పవన్ కల్యాణ్ అభిమానులు నిర్మిస్తోన్న చిత్రం ‘పరాన్నజీవి’. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమాకు సమాధానంగా పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఈ సినిమాలో సంచలన శ్రీ రెడ్డి నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీ రెడ్డి స్పందించింది. తాను ‘పరాన్నజీవి’ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని. ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ. ఆయనకు వ్యతిరేకంగా తెరకెక్కుతున్న సినిమాలో నేను ఎలా నటిస్తానంటూ ప్రశ్నించింది. నన్ను పరాన్నజీవి చిత్రం కోసం సంప్రదించిన మాట నిజమే. కాని నేను వర్మకు వ్యతిరేకంగా నటించను అంటూ చెప్పుకొచ్చింది. కాగా పరాన్నజీవి సినిమాలో శ్రీ రెడ్డి పాత్ర కూడా ఉందట. ఆమె పాత్రలో ఆమెనే నట్టించమంటే కుదరదని చెప్పడంతో వేరొకర్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. .

Recent Articles English

Gallery

Recent Articles Telugu