HomeTelugu Big Stories'శ్రీవల్లి' వీడియో సాంగ్‌ వచ్చేసింది

‘శ్రీవల్లి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Srivalli Full Video Song fr

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ‘శ్రీవల్లి’ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట (లిరికల్‌ వీడియో) విడుదలైన అనతి కాలంలోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ వీడియోలో అక్కడక్కడా చూపించిన నాయకానాయికల హావభావాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాయి. అల్లు అర్జున్‌, రష్మిక లుక్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. చంద్రబోస్‌ సాహిత్యం, సిధ్‌ శ్రీరామ్‌ గానం, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఎన్నో యువ హృదయాలను హత్తుకున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ‘శ్రీవల్లి’ ఫుల్‌ వీడియో విడుదలైంది

సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది. ఇప్పటికే డైలాగ్‌ ప్రోమోలు, డిలీటెడ్‌ సన్నివేశాలను విడుదల చేసింది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సునీల్‌, అనసూయ, అజయ్‌ ఘోష్‌, ఫహద్‌ ఫాజిల్‌ తదితరులు కీలక పాత్రలతో మెప్పించారు. ఈ సినిమా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu