కూతురుపై వస్తోన్న వార్తలను ఖండించింది!

ప్రముఖ నటి శ్రీదేవి తన కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే తన ఇద్దరు కూతుళ్ల కోసం ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయింది. దాదాపు పదిహేనేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ.. రెమో డిసౌజా నిర్వహిస్తోన్న డాన్స్ రియాల్టీ షో కోసం ఆడిషన్స్ కు వెళ్లిందని అయితే ఫైనల్స్ కు చేరలేకపోయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై శ్రీదేవి స్పందిస్తూ.. ఖుషీ గురించి అలాంటి వార్తలు విని షాకింగ్ గా అనిపించింది. నా కూతురు ఎటువంటి డాన్స్ షోలలో పాల్గొనడం లేదు. ఇలాంటివి అసలు ప్రచారంలోకి ఎలా వస్తాయో.. అర్ధం కావడం లేదని అన్నారు. 
 
హిందీలో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన రియాల్టీ షో ‘డాన్స్’ మూడవ సీజన్ కోసం ఖుషీ ఆడియన్స్ కు వెళ్లిందని టాప్ 35 వరకు చేరుకుందని.. అయితే అక్కడ పోటీ తట్టుకోలేక వెనక్కి వచ్చేసిందని అన్నారు. మరి ఈ విషయంపై శ్రీదేవి క్లారిటీ ఇవ్వడంతో ఇక ఈ ప్రచారానికి బ్రేక్ పడుతుందనే అనుకుంటున్నారు. ప్రస్తుతం ‘మామ్’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీదేవికి తన ఇద్దరు కూతుళ్లకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతున్నాయని తెలిపింది.