HomeTelugu Trendingపుష్ప నుండి 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో

పుష్ప నుండి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో

Srivalli Promo from Pushpa

డైరెక్టర్‌ సుకుమార్‌- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ‘పుష్ప’ చిత్రంతో నుండి రెండో పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిధ్‌
శ్రీరామ్‌ ఆలపించారు. చంద్రబోస్‌ రచించారు. పూర్తిగీతం ఈ నెల 13న విడుదలకానుంది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం డిసెంబరు 17న విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu