HomeTelugu Trending'సలార్‌'లో బంగార్రాజు బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌!

‘సలార్‌’లో బంగార్రాజు బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌!

bangarraju fame Simrat Kaur
గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సలార్‌ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌ గా వస్తున్ ఈ సినిమాకి కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా వస్తుండగా.. సలార్‌-1 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తకర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో యంగ్ పంజాబీ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ ఐటమ్‌ సాంగ్‌లో మెరువబోతుందన్న టాక్‌. బంగార్రాజులో కామియో రోల్‌లో మెరిసిన సిమ్రత్‌ కౌర్.. డర్టీ హరిలో కూడా నటించింది.

ఈ ఏడాది Gadar 2లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో స్పెషల్ సాంగ్‌ చేస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అయితే అఫీషియల్‌ ప్రకటించాల్సి ఉంది. ఈవార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. కొరియోగ్రఫర్‌ రాజు సుందరం పర్యవేక్షణలో ఈ సాంగ్‌ ఉండనుంది. వెకేషన్‌ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చాడు ప్రభాస్‌. అయితే ఇంకా సాంగ్ షూట్‌లో జాయిన్ కావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu