HomeTelugu Trendingప్రేక్షకులను థ్రిల్‌ చేయనున్న 'పుష్ప' బోట్ ఫైట్‌!

ప్రేక్షకులను థ్రిల్‌ చేయనున్న ‘పుష్ప’ బోట్ ఫైట్‌!

Stellar boat fight in pushp
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శేషాచలం అడవుల్లో జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఇంట్రడక్షన్‌ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2 భాగాలుగా ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీన్‌ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటివరకూ భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ చూపించని విధంగా ఓ బోట్ ఫైట్‌ను రూపొందిస్తున్నారట. ఇప్పుడు సినీ జనాలు అంతా దీనిగురించే చర్చించుకుంటున్నారు. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉండబోతుందట. దీనిపై త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. పుష్ప సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu