HomeTelugu Trendingనయనతార కెరీర్‌లో 20 ఏళ్లు పూర్తి

నయనతార కెరీర్‌లో 20 ఏళ్లు పూర్తి

Nayanatara 20 yearsచంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు సోలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తూ డిసెంబర్‌ 25తో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

నయనతారకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార జర్నీతో డిజైన్‌ చేసిన CDP నెట్టింట వైరల్ అవుతోంది. లేడీ సూపర్ స్టార్ కెరీర్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నయనతార కెరీర్‌లో 75వ సినిమాగా వ‌చ్చిన‌ ‘అన్నపూరణి’ ఈ మధ్యనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సూపర్ హిట్ టాక్‌ అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం థియేట‌ర్‌ల‌లో సందడి చేస్తోంది. మరోవైపు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ చిత్రాన్ని పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా డిసెంబర్ 29 నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌. మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న మరో రెండు తమిళ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu