HomeTelugu Newsసుధీర్‌ బాబు 'వి' ఫస్ట్‌లుక్‌

సుధీర్‌ బాబు ‘వి’ ఫస్ట్‌లుక్‌

5 24
హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న ‘వి’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం ఉదయాన్నే విడుదల చేసింది. తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేసిన సుధీర్‌.. ‘తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం.. ‘వి’ సినిమా రక్షకుడు వచ్చేశాడు.’ అని సుధీర్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఇందులో సుధీర్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని విలన్‌ లక్షణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ హీరోయిన్‌లుగా నటించనున్నారు. మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu