HomeTelugu NewsAnushka Shetty: హారర్‌ మూవీతో మలయాళ ఎంట్రీ!

Anushka Shetty: హారర్‌ మూవీతో మలయాళ ఎంట్రీ!

anushka shetty new movie

Anushka Shetty: స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు వచ్చింది. ఈ రోజు అనుష్క తన మ‌ల‌యాళం డెబ్యూ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఫొటోల్లో స్లిమ్‌లుక్‌లో అనుష్క క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

క‌థ‌నార్ అనే హార‌ర్ మూవీతో అనుష్క మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. రోజిన్ థామ‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్‌ హీరో జ‌య‌సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు. అనుష్క‌కు చిత్ర యూనిట్ ఫ్ల‌వ‌ర్ బొకే ఇచ్చి గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పింది.

9వ శ‌తాబ‌ద్దానికి చెందిన క‌డ‌మ‌ట‌ట్టు క‌థ‌నార్ అనే క్రిస్టియ‌న్ ప్రీస్ట్ జీవితం ఆధారంగా క‌థ‌నార్‌ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ హార‌ర్ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా క‌థ‌నార్ రూపుదిద్దుకుంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమా మొత్తం ప‌ద‌మూడు భాష‌ల్లో విడదుల కాబోతున్నట్లు టాక్‌. ఇండియ‌న్ లాంగ్వేజెస్‌తో పాటు కొరియ‌న్‌, జ‌పాన్‌, చైనీస్‌, ర‌ష్య‌న్ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

2005లో నాగార్జున హీరోగా నటించిన సూప‌ర్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క‌. ఆ తరువాత తెలుగులో విక్ర‌మార్కుడు, మిర్చి, బాహుబ‌లి వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. సైజ్‌ జీరో సినిమాతో ఆమె కెరీర్‌ లో రాంగ్‌ స్టెప్‌ వేసింది. ఈ సినిమా తరువాత సినిమాలు బ్రేక్‌ ఇచ్చింది. ఇటీవలే మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాలో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu