HomeTelugu Trendingసుడిగాలి సుధీర్‌... 'కాలింగ్‌ సహస్ర' మూవీ టీజర్‌

సుడిగాలి సుధీర్‌… ‘కాలింగ్‌ సహస్ర’ మూవీ టీజర్‌

Sudheer sahasra
సుడిగాలి సుధీర్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుధీర్‌ ఓ కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన యాంకరింగ్‌, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్‌. అలా వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగా మారాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్‌ సుధీర్, 3 మంకీస్‌ సినిమాలతో అలరించిన సుధీర్‌ తాజాగా ‘కాలింగ్‌ సహస్ర’ అనే డిఫరెంట్‌ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుడిగాలి సుధీర్.

ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం (ఏప్రిల్‌ 1) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో ప్రతి సన్నివేశం ఆసక్తి పెంచేలా ఉంది. రాధా ఆర్ట్స్‌, షాడో మీడియా ప్రొడక్షన్‌ సంయుక్త సమర్పణలో విజేష్‌ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అరుణ్‌ విక్కీరాల దర్శకత్వం వహించగా మోహిత్‌ రహ్మణియక్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu