HomeTelugu Trendingశివరాత్రికి డబుల్ ఇస్మార్ట్

శివరాత్రికి డబుల్ ఇస్మార్ట్

Double Ismart release dateపూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వస్తున్న మరో మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కీలక సన్నివేశాలు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌తో పాటు కొందరు ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీ అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ ఇస్తూ మేకర్స్ 100 రోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశారు.

‘డబుల్ ఇస్మార్ట్‌’ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హైబడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu