HomeTelugu TrendingA1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్

A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్

Sundeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘A1 ఎక్స్‌ప్రెస్’. కెరీర్‌లో మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీపి కిషన్ ఇప్పుడు క్రీడా నేపథ్యమున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. హాకీ క్రీడ అంశంగా తెలుగులో వస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ‘సింగిల్ కింగులం’ అనే పాట యువతను బాగా ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. వందేమాతరం అనే నినాదంతో ట్రైలర్ మొదలవుతుంది. డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, సందీప్ కిషన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu