HomeTelugu Trendingగాయపడ్డ హీరో సందీప్‌ కిషన్‌

గాయపడ్డ హీరో సందీప్‌ కిషన్‌

9 15యువ నటుడు సందీప్‌ కిషన్‌ శనివారం ‘తెనాలి రామకృష్ణ’ షూటింగ్‌లో గాయపడ్డాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూలులో షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది. ప్రాథమిక చికిత్స అనంతరం సందీప్ కిషన్‌ను కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించారు.

కాగా, శుక్రవారం సందీప్‌ కిషన్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ చిత్రీకరణలో భాగంగా బస్సులో నుంచి కిందపడే సన్నివేశానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu