HomeTelugu Trendingశంకర్ మూవీలో నా పాత్ర మామూలుగా ఉండదు: సునీల్‌

శంకర్ మూవీలో నా పాత్ర మామూలుగా ఉండదు: సునీల్‌

Sunil about Shankar movie

టాలీవుడ్‌ నటుడు సునీల్ పూర్తి స్థాయి కామెడీ పాత్రలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ లోగా తనకి వచ్చిన విభిన్నమైన పాత్రలను చేస్తూనే, గతంలో తాను వదిలేసిన ప్లేస్ కి చేరుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాలోను సునీల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో తన పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందనీ, ఇది మామూలుగా వుండదనీ, ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని సునీల్ చెబుతున్నాడు. చరణ్ పాత్ర వెంటనే ఉంటూ ఈ సినిమా మొత్తం తాను కనిపిస్తాననీ, తన పాత్రను గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu