HomeTelugu Trending'వేదాంతం రామయ్య'గా సునీల్‌

‘వేదాంతం రామయ్య’గా సునీల్‌

Sunil as vedantam raghavai

టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. ఆతర్వాత హీరోగా మారి అలరించాడు. అయితే హీరోగా పెద్దగా రాణించలేకపోవడంతో తిరిగి కమెడియన్ గా మారాడు. ఇటీవల ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వేదాంతం రామయ్య’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్‌ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ, మాటలను అందిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాను హరీష్ శంకరే నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్‌ చేశారు. ఈ సినిమా పక్కా ఫ‌న్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా హరీష్ శంకర్ శిష్యుల్లో ఒకరిని పరిచయం చేసే అవకాశం వుంది. ఈ రోజు మంచి రోజు అని సినిమాను ప్రకటించారు. త్వరలో అన్నీ ఫిక్స్ అయిన తరువాత మరిన్ని వివరాలు అందిస్తారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu