HomeTelugu Trending'దిశ' ఘటనపై రామ్‌ గోపాల్‌ వర్మ చిత్రం

‘దిశ’ ఘటనపై రామ్‌ గోపాల్‌ వర్మ చిత్రం

6

డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేసారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ దిశా ఘటన పై వర్మ త్వరలో సినిమాను తెరకెక్కించనున్నారు. అతిదారుణంగా ఓ యువతీ పై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై పెట్రోల్ పోసి దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎంకౌంటర్ చేసారు. ఈ ఎంకౌంటర్లో నలుగురు నిందితులు మృతిచెందారు. ఈ ఉదంతం పై వర్మ సినిమా తెరకెక్కించనున్నానని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన దిశా ఘటన పై సినిమాను తెరకెక్కిస్తున్న అని ప్రకటన చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu