HomeTelugu Trendingషకలల శంకర్‌ 'ది బాస్‌' టైటిల్‌ లోగోను విడుదల చేసిన సునీల్‌

షకలల శంకర్‌ ‘ది బాస్‌’ టైటిల్‌ లోగోను విడుదల చేసిన సునీల్‌

Sunil released shakalaka sh
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బాస్’. యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న ఈ సినిమాకి నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా… బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం ‘ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు.

Sunil 1

ఈశ్వర్ బాబు దర్శకత్వంలో బొమ్మకు మురళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ది బాస్-నెవర్ డైస్” సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని…. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం “ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu