HomeTelugu Big Storiesసన్నీలియోన్‌లోని మరో కోణం చూశారా?

సన్నీలియోన్‌లోని మరో కోణం చూశారా?

1 5సన్నీలియోన్‌ అంటే కుర్రకారు గుండెల్ని పిండేసే అందం అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తనలోని మరోకోణాన్ని బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. అడల్ట్ మూవీస్‌తో అందరి గుండెల్లో ముద్రవేసుకున్న సన్నీలియోన్ ఆ తర్వాత బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. ఇప్పుడు తన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఓ వైపు సినిమా
రంగంలో దూసుకెళ్తూనే మరోవైపు ఛారిటీ వైపు తన అడుగులు వేస్తోంది. అనాధ పిల్లలను దత్తత తీసుకొని తన మంచి మనసును చాటుకుంది సన్నీ.

తాజాగా క్యాన్సర్ రోగులను ఆదుకోవడానికి సన్నీలియోన్‌ ముందుకు వచ్చింది. సొంతంగా పెయింటింగ్ వేసి, వాటిని వేలం వేసేందుకు సిద్ధం అయ్యింది. ఖాళీ సమయంలో కూర్చొని పెయింటింగ్ వేసింది. అదేదో ఆషామాషీ పెయింటింగ్ అనుకుంటే పొరపాటే. అద్భుతమైన పెయింటింగ్. సన్నీలియోన్ మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్ అని నిరూపించుకుంది. సన్నీ తన పెయింటింగ్ వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును క్యాన్సర్ రోగుల కోసం విరాళంగా ఇవ్వబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu