బోయపాటితో అఖిల్..?

ప్రస్తుతం నాగార్జున తన కొడుకుల కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ముందుగా అఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి విక్రమ్ కె కుమార్ తో అఖిల్ హీరోగా సినిమాను నిర్మిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. దీని తరువాత అఖిల్ నటించే మూడో చిత్రాన్ని కూడా నాగార్జున ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అఖిల్ ను ఓ మాస్ హీరోగా నిలబెట్టడానికి బోయపాటి శ్రీనుతో సినిమా చేయించాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బోయపాటికి దాదాపు 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేయాలంటే బోయపాటి లాంటి డైరెక్టర్ తోనే సాధ్యమని అంత మొత్తం ఇవ్వడానికి నాగార్జున రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో బోయపాటి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.