HomeTelugu Trendingముగిసిన కృష్ణ అంత్యక్రియలు

ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

celebrities pays tribute to
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. దారికి ఇరువైపులా నిలబడిన ఫ్యాన్స్‌ తమ అభిమాన నటుడికి కన్నీటితో వీడ్కోలు పలికారు. మరోవైపు మహాప్రస్థానంలోకి కృష్ణ కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులను మాత్రమే అనుమతించారు. అంత్యక్రియలను కూడా పోలీసుల గౌరవ వందనం వరకు మాత్రమే లైవ్ లో చూపించారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ ను ఆపేశారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu