HomeTelugu Trendingవిజయ్‌పై అభిమానం చాటుకున్న ఛార్మి

విజయ్‌పై అభిమానం చాటుకున్న ఛార్మి

Charmy kaur tweet on vijay
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి విషెష్ తో పోల్చితే ఛార్మి విషెష్ చాలా స్పెషల్ గా ఉందంటూ వార్తలు వినిపిస్తుంది. విజయ్ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే 26 కేరట్ ల బంగారం అంటూ ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విజయ్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి బంగారం అంటూ సంభోదిస్తూ తనకు రౌడీ స్టార్ అంటే ఎంత ప్రత్యేకమైన అభిమానమో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.

పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా కు ఛార్మి ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈమద్య కాలంలో నటిగా పెద్దగా కనిపించని ఛార్మి వరుసగా సినిమాల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తుంది. లైగర్ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి సందర్బానుసారంగా ఛార్మి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu