కథ రెడీ.. చిరుతో సినిమా పక్కా.. !

అతనొక్కడే వంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథతో దర్శకుడిగా పరిచయమయ్యాడు సురేందర్
రెడ్డి. ఆ తరువాత కిక్, రేసుగుర్రం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు రూపొందించారు. అయితే
ఆయన రూపొందించిన ‘కిక్2’ సినిమా మాత్రం ఘోర పరాజయం పొందింది. దీంతో ఈసారి
రామ్ చరణ్ హీరోగా ‘దృవ’ సినిమాను రూపొందించారు. తమిళ ‘తని ఒరువన్’ చిత్రానికి
ఇది రీమేక్. ఈ సినిమాపై సురేందర్ రెడ్డి ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కోసం
చరణ్ తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని, దర్శకుడిగా నాకు ఫ్రీడం ఇచ్చారని సురేందర్ రెడ్డి
అన్నారు. అలానే చరణ్ వంటి కమిట్మెంట్, హానెస్టీ ఉన్న వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని
అన్నారు.
గీతా ఆర్ట్స్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఆ కాంపౌండ్ లోనే ఇప్పుడు
మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ మెగాహీరోతోనో కాదు.. ఏకంగా
మెగాస్టార్ తోనే సినిమా చేస్తున్నాడు. అవును.. ఈ విషయాన్ని సురేందర్ రెడ్డి స్వయంగా
వెల్లడించారు. చిరంజీవి గారితో డిస్కషన్స్ చేశాను. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఆయనతో
సినిమా చేయాలనుకుంటున్నాను. కథ అంతా సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది 100% చిరంజీవి
గారితో సినిమా పక్కాగా ఉంటుందని చెప్పారు.