‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదలవుతుందా..? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. మొదటి నుండి అనుకుంటున్నట్లు ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ నే ఖరారు చేశారు. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోఫాలో కూర్చొని కోపం గా చూస్తున్నాడు పవన్. ఐడి కార్డ్ పట్టుకొని తిప్పుతున్నాడు. సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా
కనిపించనున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఫస్ట్ లుక్ 10 గంటల సమయంలో విడుదల కావల్సివుంది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా ఆలస్యమైందని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని వారు వెల్లడించారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.