HomeTelugu Trendingకొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

Producer Suresh Babu

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్‌బాబు. ఇప్పటికే అనేకమంది దర్శకులను, నటీనటులను, టెక్నీషియన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. పూర్వ విద్యార్థిని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశంతో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ సినిమాను రూపొందించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu