HomeTelugu Trendingప్రభాస్ హోమ్ బ్యానర్‌లో సూర్య సినిమా!

ప్రభాస్ హోమ్ బ్యానర్‌లో సూర్య సినిమా!

Suriya movie in Prabhas hom

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హోమ్ బ్యానర్ ‘యూవీ క్రియేషన్స్’లో.. భారీ సినిమాలు నిర్మిస్తూనే, మరో వైపున ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ 2 తో కలిసి చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇలా యూవీ బ్యానర్ నుంచి వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కుతూనే ఉన్నాయి.

ఇక ఈ బ్యానర్ నుంచి ద్విభాషా చిత్రాలను కూడా నిర్మించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్.. ధనుష్.. శివకార్తికేయన్ హీరోలుగా తెలుగు.. తమిళ భాషల్లో సినిమాలు నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. అలా సూర్య హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమాను నిర్మించడానికి యూవీ వారు రంగంలోకి దిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. హీరో అజిత్ కి వరుసగా భారీ హిట్లు ఇచ్చిన శివ, ఇటీవల రజనీకాంత్ కి మాత్రం ‘పెద్దన్న’తో హిట్ ఇవ్వలేకపోయాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu