HomeTelugu Trendingకమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో సూర్య

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో సూర్య

High Security At Suriya House On Jai Bhim Controversy

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న చిత్రం `విక్రమ్‌`. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

కాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించనున్నారని కోలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌. ఇటీవల ‘విక్రమ్‌’ షూటింగ్‌ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్‌ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది.. ..

Recent Articles English

Gallery

Recent Articles Telugu