రామ్‌ చరణ్‌తో ఉపాసన వర్కౌట్‌.. ఫొటో వైరల్‌

ఉపాసన కొణిదెల.. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య గానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతోంది. అంతేకాకుండా పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు పొందింది. అంతేకాకుండా..ఇటీవల ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఇటీవల ఉపాసన తన భర్త రామ్ చరణ్‌తో కలిసి వర్కౌట్స్ చేసిన.. పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో చరణ్ అభిమానులు వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.