HomeTelugu Trendingసూర్య కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సూర్య కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Suriyas etharkkum thunindha

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర‍్యకు మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘జై భీమ్‌’ తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో మూడు నెలల్లో తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ఎతర్కుమ్‌ తునింధవన్‌’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదలకు సిద‍్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌.

ఈ వీడియోలో సూర్య మాస్‌ లుక్‌లో మాస్‌ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. పాండిరాజ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సన్‌ పిక‍్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగనుంది. వినయ్ రాయ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, శరణ్య, ఎం.ఎస్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. తమిళ హీరో శివ కార్తికేయన్‌, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ సాహిత్యమందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu