HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో రెజీనా ఐటెం సాంగ్..

చిరంజీవి సినిమాలో రెజీనా ఐటెం సాంగ్..

7 27
మెగాస్టార్ చిరంజీవి.. సైరా చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవాలయాలకు సంబంధించిన యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతున్నది. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు సాంగ్ తో మెగాస్టార్ అదరగొట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇంకా చెప్పాలి అంటే ఈ ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉన్నది. ఈ ఐటెం సాంగ్ కోసం రెజీనాను తీసుకున్నారు. రెజీనా మెగా కుటుంబంలోని సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ లతో సినిమాలు చేసింది. ప్రస్తుతం రెజీనా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. దీంతో మెగాస్టార్ తో ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు ఒకే చెప్పిందట. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా చేస్తుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu