HomeTelugu Newsసూర్య 38 చిత్రం ఖరారు.. టైటిల్‌ ఇదే

సూర్య 38 చిత్రం ఖరారు.. టైటిల్‌ ఇదే

2 1
కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య 38వ సినిమాను సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళంలో ‘సురారై పొట్రు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్ తో రానుంది.

ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, సూర్య మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. హరి దర్శకత్వంలో ఆయన మరో మూవీ చేయనున్నాడు. గతంలో హరి – సూర్య కలిసి వరుసగా నాలుగైదు హిట్లు కొట్టారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. స్టూడియో గ్రీన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘అరువా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu