వరుణ్ ని చూస్తే ఈర్ష్య, అసూయ కలుగుతున్నాయి: చరణ్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘అంతరిక్షం 9000’ కిలోమీటర్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (మంగళవారం) సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ని కొనుగోలు చేశారు. అనంతరం సినిమా గురించి చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి.

వరుణ్ తేజ్ మంచి సినిమాతో ముందుకు వస్తున్నాడు. వరుణ్ తేజ్ పై ఉన్న ప్రేమకంటే ఈ ట్రైలర్ చూసిన తరువాతే ఫంక్షన్ కు రావాలనిపించింది. ఈమధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ ను నేను చూడలేదు. అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న వరుణ్ చూస్తుంటే ఈర్ష్య, అసూయ కలుగుతున్నాయని చమత్కరించారు చరణ్. ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ మూవీని రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.