HomeTelugu Trendingఅలరిస్తున్న సూర్య 'జైభీమ్' పవర్ సాంగ్

అలరిస్తున్న సూర్య ‘జైభీమ్’ పవర్ సాంగ్

Surya Jai Bheem
త‌మిళ స్టార్ హీరో సూర్య తాజాచిత్రం జైభీమ్‌. ఈ చిత్రం ఓ రియల్ కథాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్య‌మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సూర్య త‌మిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఇది డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది. తాజా చిత్రం జైభీమ్ కూడా ఓటిటి లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

Surya Jai Bheem2

నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ‘జైభీమ్’ చిత్రం రిలీజ్ కాబోతోంది. గిరిజ‌నుల‌కు న్యాయం జరిగేలా పోరాడే లాయ‌ర్ చందులాల్ పాత్ర‌లో సూర్య క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే విడుద‌లైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ లు చాలా ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu