HomeTelugu Trendingస్టార్‌ హీరోలకు ఎన్టీఆర్‌ సవాల్‌‌.. వైరల్‌ అవుతున్న ఛాలెంజ్‌

స్టార్‌ హీరోలకు ఎన్టీఆర్‌ సవాల్‌‌.. వైరల్‌ అవుతున్న ఛాలెంజ్‌

1 20
లాక్‌డౌన్ కారణంగా సెలెబ్రెటీలు కొత్త కొత్త ఛాలెంజ్ లను సృష్టిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌లు ఓన్లీ పిల్లో ఛాలెంజ్ లు చేస్తుంటే టాలీవుడ్ లో ఇప్పుడు కొత్తగా మరొక ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. అదే బాతే రియల్ మ్యాన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఇటీవలే రాజమౌళి ఇంట్లో గిన్నెలు తోమి, ఇల్లు తుడిచి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఆయన ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.

ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎన్టీఆర్ ఈరోజు ఇంట్లో గిన్నెలు తోమి, ఇల్లు తుడిచాడు. దీనికి సంబంధించిన వీడియోను అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అంతేకాదు, బాబాయ్ బాలకృష్ణకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేష్‌కు, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు. మొత్తానికి టాలీవుడ్ లో ఈ ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu