HomeTelugu Big Storiesఓటీటీలో సుశాంత్‌ చివరి సినిమా!

ఓటీటీలో సుశాంత్‌ చివరి సినిమా!

9 20
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమాను అభిమానులను ఎలాగైనా థియేటర్స్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. దాంతో ఆయన చివరి సినిమా కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. ఈయన గత సినిమా డ్రైవ్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైంది. లాక్‌డౌన్‌కు ముందే..’ చిచ్చోరే’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సుశాంత్ సినిమాను కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ రావడం లేదంటూ కరణ్ జోహార్ డ్రైవ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశాడు.

ఇదిలా ఉంటే ఆయన మరణం తర్వాత ఇప్పుడు చివరి చిత్రం దిల్ బెచారా కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. బాలీవుడ్ ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రా ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంజనా సంఘి హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జులై 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. సుశాంత్ చివరి సినిమాను దయచేసి థియేటర్స్‌లో విడుదల చేయాలని ఏఆర్ రెహమాన్ కూడా కోరాడు.

కానీ నిర్మాతలు మాత్రం హాట్ స్టార్‌కు ఇచ్చేశారు. హాలీవుడ్ చిత్రం ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ రీమేక్‌గా ‘దిల్ బేచారా’ తెరకెక్కింది. ఈ సినిమా కచ్చితంగా అందరి మనస్సుల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వస్తుంది. మరి సుశాంత్ చివరి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu