HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

RRR movie first glimpse rel

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ప్రమోషన్స్‌ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియో ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌’పేరుతో 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ ..కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu