HomeTelugu Trendingకూతురు సుస్మితా నిర్మాతగా .. చిరంజీవి సినిమా!

కూతురు సుస్మితా నిర్మాతగా .. చిరంజీవి సినిమా!

sushmita konidela producer
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ హిట్‌తో మంచి జోష్‌ మీద ఉన్నాడు. బాబీ కొల్లి డైరెక్షన్‌లో వచ్చి ఈ సినిమాలో చిరంజీవి హీరోగా.. రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం చిరు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.

అయితే చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మితా కొణిదెల.. ఈ సారి చిరంజీవి సినిమాకు నిర్మతగా వ్యవహారించనున్నట్లు తెలుస్తోంది. సర్దార్ సినిమా దర్శకుడు పీఎస్ మిత్రన్కు చిరంజీవి ఓకే చెప్పారని తెలుస్తోంది. కార్తి నటించిన సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తమిళ దర్శకుడికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్‌.

చిరంజీవి కథను విన్నాడని.. నచ్చడంతో ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సుస్మిత కొణిదెల ఆమె భర్త విష్ణు ప్రసాద్ నిర్మాతలుగా ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇటీవల వారి బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై శ్రీదేవీ శోభన్ బాబు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ ఈ సినిమా డిజిటల్/శాటిలైట్ హక్కుల నుండి ఆదాయాన్ని పొందిందని చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu