15 ఏళ్ళు చిన్నవాడైన రోమన్ షాల్ తో సుష్మితా సేన్ భంగిమలు!!


బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసింది . అయితే ఇంత వరకు ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు ఇప్పడూ తాజాగా తన కంటే 15 ఏళ్ళు చిన్నవాడైన రోమన్ షాల్ తో డేటింగ్ లో ఉంది . అయితే ఈ అమ్మడు వీరి రేలషన్ గురించి ఫోటోలు వదులుతూ అందరికీ క్లారిటీ ఇస్తుంది . లేటెస్ట్ గా ఇద్దరు డిఫరెంట్ గా వర్కౌట్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది . అయితే సుస్మితా సేన్ గత కొంతకాలంగా పెళ్లికి దూరంగా వుంటూ వరుస ప్రియులను మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ముదురు బ్యూటీకి పెళ్లిమీద గాలిమళ్లినట్టుంది. రోమన్ షాల్ తో సుస్మిత గత కొంత కాలంగా రహస్య డేటింగ్ లో వుందని వార్తలు జోరందుకున్నాయి.

ఆ వార్తల్ని నిజం చేస్తూ సుస్మిత తన సోషల్ మీడియా ట్వట్టర్ లో వరుస ఫొటోలు పోస్ట్ చేసి `చాలా.. ఇంకా కావాలా` అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి షాకిచ్చింది. అయితే సుస్మిత ప్రియుడు రోమన్ షా మొన్నా ఆ మధ్య అదిరిపోయే పోస్ట్ పెట్టి ఇద్దరి మధ్య వున్న బంధాన్నిఇన్ స్టాగ్రామ్ సాక్షిగా బట్టబయలు చేశాడు. సుస్మితాసేన్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రోమన్ షా `న ప్రేయసికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ ఏడాది నీకు అద్భతంగా వుండాలి. నువ్వు మధురమైన క్షణాల్ని గడపాలని కోరుకుంటున్నా.

సుష్ ఐ లవ్ యు.. అంటూ రోమన్ షా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇది వరకే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చూసిన వారంతా ముదురు ప్రేమ ఇన్ స్టాగ్రామ్ కెక్కిందే అంటూ చలోక్తులు విసురుతున్నారు. ముంబైలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత – రోమన్ తొలిసారి కలిశారట. ఆ తరువాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. రోమన్ షా కంటే సుస్మిత 15 ఏళ్లు పెద్దది కావడం ఇక్కడ గమనార్హం. అయినా ముదురు ప్రేయసితో రోమన్ షా పెళ్లికి సిద్ధమవుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోందట.