HomeTelugu Trendingఓటీటీలో 'స్వాతిముత్యం' ఎప్పుడంటే!

ఓటీటీలో ‘స్వాతిముత్యం’ ఎప్పుడంటే!

Swathi mutyam on ott
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు చిన్న కొడుకు గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘స్వాతిముత్యం’. భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 5న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. పోటీగా గాడ్‌ఫాదర్‌, ది ఘోస్ట్‌.. చిత్రాలు ఉండటంతో ఈ సినిమా నిలబడలేకపోయింది. లక్ష్మణ్‌ కే కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలో బాట పట్టింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను రిలీజ్‌ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 28నుండి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్‌కు నాలుగు వారాల్లోపే ఓటీటీ బాట పట్టింది. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన ఈసినిమాని సితార ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. రావు రమేష్, గోపరాజు రమణ కీలకపాత్రల్లో నటించగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu