
Kalki 2898 AD Sequel Release:
ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” టాలీవుడ్ ప్రేక్షకులను విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ కాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పటికే ఈ సినిమా విజయం సాధించగా, సీక్వెల్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, సలార్ సీక్వెల్, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2898 AD సీక్వెల్ ఆలస్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్బంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ, కల్కి 2898 AD సీక్వెల్ 2026లోనే విడుదల కానుందని చెప్పారు. కమల్ హాసన్ పాత్ర మొదటి భాగంలో తక్కువగా కనిపించినప్పటికీ, సీక్వెల్‌లో పెద్ద స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు, ప్రభాస్-కమల్ హాసన్ మధ్య సీన్‌లు, ప్రభాస్-దీపికా పదుకొణె-అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానున్నాయట.
సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని నాగ వంశీ వెల్లడించారు. సైన్స్ ఫిక్షన్ కథలో కొత్త మలుపులతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. ప్రభాస్ హీరోగా, కమల్ హాసన్ ముఖ్యపాత్రలో నటించే ఈ సీక్వెల్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.