HomeTelugu Trending'సైరా' ట్రైలర్‌ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్‌

‘సైరా’ ట్రైలర్‌ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్‌

6 10టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu