శేఖర్ కమ్ముల సినిమాలో హైదరాబాదీ అమ్మాయి

డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్‌ల పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన పరిచయం చేసిన కథనాయికలు అందరూ విదేశీ హీరోయిన్‌లు అయినప్పటికీ అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా ఉండి ప్రేక్షకులకు ఇప్పటికే గుర్తుండిపోయారు. తాజాగా అయన చేసిన ‘ఫిదా’ చిత్రంలో సాయి పల్లవి చేసిన భానుమతి పాత్రతో సహా. కానీ ఈసారి చేస్తున్న సినిమాకి మాత్రం డింపుల్ హయాతి అనే తెలుగమ్మాయిని ఎంచుకున్నాడు ఈ దర్శకుడు. ‘గల్ఫ్’ సినిమాతో నటిగా పరిచయమైంది ఈ హైదరాబాదీ అమ్మాయి. మరి ఈమెకు కమ్ముల్ ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి.