HomeTelugu Trending'సైరా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిధులు వీరే..

‘సైరా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిధులు వీరే..

10 7మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కధతో తెరకెక్కుతున్న ఈ చిత్రాని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ మీద రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, శాండిల్ వుడ్ నుండి కిచ్చా సుదీప్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించి మరింత హైప్ పెంచారు. ఇక ఈ సినిమా గాంధీ జయంతి ఆ తర్వాత వచ్చే దసరా బిజినెస్ బేస్ చేసుకుని అక్టోబర్ 2న విడుదల కానుంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ ఇంకా సరైన ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ మధ్య ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్ చేయలేదు. దీంతో సినిమా వాయిదా పడచ్చనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ వేడుకను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్, లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతేకాక ప్రత్యేక అతిథులుగా కేటీఆర్, పవన్ కళ్యాణ్, రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని కూడా సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu