HomeTelugu Trendingప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్‌' కన్నుమూత

ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్‌’ కన్నుమూత

tabla prasad
ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్‌’ శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం ఇచ్చిన ఎన్నో పాటలు హిట్‌ అయ్యాయి. ఉత్తర భారదేశంలో ఆర్‌డి బర్మన్‌, సి. రామచంద్ర, లక్ష్మీకాంత్‌ ప్యారీలాల్‌, నవ్‌షత్‌, పప్పిలహరితోపాటు సౌత్‌ ఇండియాలో స్క్రీన్‌ మ్యుజిషియన్‌ తిలక్‌ కెవిఎం, మెలోడీ కింగ్‌ ఎమ్‌ఎస్‌వి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా వంటి చాలా మందికి తబలా వాయించారు.

అంతేకాకుండా ఈ జనరేషన్ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా, జివి ప్రకాష్‌తో కలిసి ఐదుకుపైగా భాషల్లో సుమారు 2500 చిత్రాలకు పనిచేశారు. వీటన్నింటితో కలిపి దాదాపు 60000 పాటలకు ఆయన తబలా వాయించారు. 79 ఏళ్ల తబలా ప్రసాద్‌కు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారులైన రమణ, కుమార్‌లు కూడా సంగీత విద్వాంసులుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

‘రాధే శ్యామ్’ 4 రోజుల కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu