HomeTelugu Trending'అర్జున్‌ సురవరం' మొదటి వీడియో రీలీజ్

‘అర్జున్‌ సురవరం’ మొదటి వీడియో రీలీజ్

4 24హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా ‘అర్జున్‌ సురవరం’ అనే సినిమా రూపొందుతోంది. టి.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా నిఖిల్‌ ఆదివారం వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం అభిమానుల సమక్షంలో ‘అర్జున్‌ సురవరం’ నుంచి మొదటి వీడియో పాటను విడుదల చేశారు. ‘కన్నే కన్నే రెప్పే వెస్తే నీకలలోకే నడిచానే. నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేను మరిచానే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.

నిఖిల్‌ తన ప్రేమ గురించి లావణ్యకు తెలియజేస్తూ ఈ పాటలో కనిపించారు. విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎస్‌.సి.సామ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నవంబర్‌26న జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu