HomeTelugu Trendingత్రివిక్రమ్‌, బన్నీ సెట్‌లో టబు ఎంట్రీ

త్రివిక్రమ్‌, బన్నీ సెట్‌లో టబు ఎంట్రీ

5 23

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. టబు సెట్‌లో స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు తీసిన వీడియోను షేర్‌ చేసింది. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వినోదాత్మకమైన కుటుంబ నేపథ్య చిత్రంగా తెరకెక్కబోతోందని చిత్రవర్గాలు వెల్లడించాయి. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu