HomeTelugu Trendingరాజు ఇలానే ఉంటాడేమో: తమన్నా

రాజు ఇలానే ఉంటాడేమో: తమన్నా

Tamanna About Prabhas Hospi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సింపుల్ సిటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రభాస్‌ తనతో వర్క్‌ చేసినవారికి ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారు. రకరకాల రుచికరమైన వంటకాలతో విందు ఇవ్వడంలో ఆయనకు మించినోళ్లు లేరు. తాజాగా మరోసారి ప్రభాస్ ఆతిథ్యం గురించి చర్చ జరుగుతోంది.

తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ప్రభాస్‌ ఆతిథ్యం గురించి ప్రస్తావించింది. ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటాడో దేశం మొత్తానికి తెలుసు. ఆయన భోజనం కు ఆహ్వానిస్తే 30 రకాల వంటకాలను తయారు చేయిస్తాడు.

Tamann2

డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి ప్రభాస్ కానే కాదు. రాజు అనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించే విధంగా ప్రభాస్ తన మంచి తనంతో అతిథి మర్యాదలతో బాబోయ్ అనిపిస్తాడని తమన్నా పేర్కొంది. తనకు అంతగా స్టార్ డమ్ ఉన్నా.. అభిమానులు ఉన్నా కూడా చాలా సింపుల్ గా అందరితో కలిసి పోతూ ఉంటాడు.

అలా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రభాస్ కు మాత్రమే అలా సాధ్యం. ఆయన యొక్క సింప్లిసిటీ అందరికి నచ్చతుందని తమన్నా ప్రభాస్‌పై ప్రశంసలు కురింపించింది. గతంలో ప్రభాస్ యొక్క ఆతిథ్యం గురించి ఇలా మాట్లాడిన వారిలో అమితాబచ్చన్ మొదలుకుని దీపికా పదుకునే.. శృతి హాసన్.. శ్రద్దా కపూర్.. కృతి సనన్ ఇంకా ఎంతో మంది సౌత్ స్టార్స్ కూడా ఉన్నారు.

Tamann1

ఆయన ఆతిథ్యం కోసమే చాలా మంది ప్రభాస్ తో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు అంటూ ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu