HomeTelugu Trendingతెలుగు షోలో హోస్ట్‌గా మిల్కీ బ్యూటీ!

తెలుగు షోలో హోస్ట్‌గా మిల్కీ బ్యూటీ!

Tamannaah as a host in telu

మిల్కీ బ్యూటీ తమన్నా యాంకర్‌గా మారనుంది. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ‘లెవన్త్‌ అవర్‌’, డిస్నీ హాట్‌ స్టార్‌లో ‘నవంబర్‌ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ల్లో నటించి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించింది. ఇకపై ఈ బ్యూటీ ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి.. అంతేగాక ముప్పై సంవత్సరాల నుండి వివిధ దేశాల్లో విజయవంతంగా రన్ అవుతోంది మాస్టర్ చెఫ్ ఇండియా. అలాగే పదేళ్లుగా ఇండియాలో కొనసాగుతుంది. కేవలం స్టార్ ప్లస్ ఛానల్లో అదికూడా హిందీ భాషలో మాత్రమే. అయితే ఇప్పుడు ఈ మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుపుతుందట ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌. ఈ షోకి త‌మ‌న్నా జడ్జ్‌గా ఉంటుంద‌ని, ఇప్ప‌టికే సైన్ చేయ‌డం కూడా అయిపోంద‌ని వినికిడి. త్వరలోనే దీనికి సబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్‌ 3, సీటీమార్‌, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో కూడా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu