HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌ని ఏరా.. అనేసిన తమన్నా!

రామ్‌ చరణ్‌ని ఏరా.. అనేసిన తమన్నా!

15
మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందులో శర్వానంద్ లాంటి వాళ్లు బయట ఎక్కడ కనిపించినా కూడా చరణ్‌ను ఏకవచనంతోనే పిలుస్తుంటారు. కానీ మీడియా ముందే ఏరా అనేంత ఫ్రీడమ్ మాత్రం తీసుకోరు. ఆఫ్ కెమెరాలో ఎలా ఉన్నా కూడా బయటికి వచ్చినపుడు మాత్రం చరణ్ అంటారు. కానీ అంతకు మించి ప్రేమ, అభిమానం, స్నేహం ఉన్నపుడు మాత్రం ఒక్కోసారి ఎవరున్నారనేది కూడా చూసుకోకుండా ఏరా అనేస్తుంటాం. ఇప్పుడు తమన్నా కూడా ఇదే చేసింది. కొన్నేళ్లుగా చరణ్‌తో తమన్నాకు మంచి స్నేహం ఉంది. రచ్చ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

దానికి ముందు నుంచే వీళ్లు ఫ్రెండ్స్.. ఇండస్ట్రీలో వీళ్లదో గ్యాంగ్ కూడా. ఇక ఇప్పుడు సైరాలో తమన్నా లక్ష్మీ పాత్రలో నటించింది. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది ఈ కారెక్టర్. దాంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది తమన్నా. తాజాగా సైరా సక్సెస్ మీట్‌లో కూడా పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపింది తమన్నా. చిరంజీవితో మళ్లీ మళ్లీ నటించాలనుందని చెప్పుకొచ్చింది. ఇక సురేందర్ రెడ్డికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని చెప్పింది తమన్నా.

చివరికి చరణ్ దగ్గరికి వచ్చింది.. నిన్ను నిర్మాతగా చూడాలా.. హీరోగా చూడాలా.. ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ ప్రేమగా మాట్లాడింది తమన్నా. అక్కడ చిరంజీవి ఉండగానే చరణ్‌ను ఏరా అనేంత ధైర్యం చేసిందంటే వాళ్లిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అంత క్లోజ్‌గా ఉండే హీరోలు ఇంకొందరు కూడా ఉన్నారు. ఇక హీరోయిన్లతో కూడా కలిసిపోయి ఉంటుంది తమన్నా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu