శ్రద్ధా కి కోపమొచ్చింది!

‘ఆషికీ2’ సినిమాతో అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా శ్రద్ధా కపూర్ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల ఆమె నటుడు ఫర్హాన్ అక్తర్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం నచ్చని శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ ఆమెను ఫర్హాన్ ఇంటి
నుండి తీసుకొచ్చేశాడని రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో అమ్మడు బాగా సీరియస్ అయింది.

ఈ విషయం తన దగ్గరకు వచ్చేసరికి ఆలస్యం అయిందని ఇప్పుడు కూడా స్పందించకపోతే ఈ వ్యవహారం ఇంకెక్కడ వరకు వెళ్తుందో అనే అనుమానంతో అమ్మడు స్పందించింది. తను డేటింగ్ చేస్తున్నా.. అనే ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పేసింది. ప్రస్తుతం నేను నా తల్లి తండ్రులతోనే ఉంటున్నాను. అందరికి నా పేరు లవ్ ఎఫైర్స్ లో నా పేరు వాడుకోవడం బాగా అలవాటు అయిందని.. కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది. మరి ఇప్పటికేనా.. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో
చూడాలి!