HomeTelugu Trendingతమన్నాకు ఈ ముగ్గురు హీరోలు పక్కాగా ఉండాలట!

తమన్నాకు ఈ ముగ్గురు హీరోలు పక్కాగా ఉండాలట!

3 9
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తమన్నా తల్లి ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె పెళ్లిపై అనేక పుకార్లు వచ్చాయి. కానీ వాటిని తమన్నా ఖండించారు. కాగా ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి పై స్పందించారు. ‘మీకే స్వయం వరం పెడితే.. ఏ నటులు రావాలని కోరుకుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. స్వయం వరం కోసం ముగ్గురు నటుల్ని ఎంచుకోమని అడగగా.. ‘ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌’ అని టక్కున సమాధానం ఇచ్చింది ఈ హాట్‌ బ్యూటీ.

అంతేకాదు తమన్నా ఇంత వరకు ఏ సినిమాలోనూ ముద్దు సన్నివేశాల్లో నిజంగా నటించలేదు. ఆమెతో అలాంటి సన్నివేశాలు తీయాలంటే కెమెరా ట్రిక్కులు వాడాల్సిందే. సినిమాకు సంతకం చేయడానికి ముందే తమన్నా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అయితే హృతిక్‌ కోసమైతే తన నో-కిస్‌ ఒప్పందాన్ని పక్కనపెడతానని ఈ భామ చెప్పారు. ‘సాధారణంగా నేను స్క్రీన్‌ పై కిస్‌ చేయను. నా ఒప్పందాల్లో అది ఒకటి. కానీ హృతిక్‌ రోషన్‌తో అయితే చేస్తానని నా స్నేహితులతో జోక్‌లు వేస్తుంటా’ అని ఆమె చెప్పారు. మరి తమన్నా మాటలకు హృతిక్‌, విక్కీ కౌశల్‌, ప్రభాస్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu